హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల ముందు మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ అయింది. నీటి ఒత్తిడి వల్ల తాగునీరు ఫౌంటేన్‌లా ఎగిసి పడుతోంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm