హైదరాబాద్ : పీఆర్సీ సిఫార్సులపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్కే భవన్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ ముందు పీఆర్సీ కాపీలను దగ్ధం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. లిబర్టీ వద్ద సచివాలయం ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, ఉద్యోగసంఘాల మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం లిబర్టీ సెంటర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్ట్ అయిన వారిలో ఐక్యవేదిక నాయకులు సిహెచ్ సంపత్ కుమారస్వామి, సదానందం గౌడ్, కె జంగయ్య, కె రమణ, ఎం రామారావు, కొంగల వెంకట్, చావ రవి, ఎం పర్వత రెడ్డి, డా. పురుషోత్తం, మైస శ్రీనివాసులు, టి లక్ష్మారెడ్డి, ఆర్ శారద, పి మాణిక్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రామకృష్ణ, ఎం వెంకటప్ప, జి వందన, ఇప్తికార్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm