హైదరాబాద్ : తమిళ హీరో విజయ్ తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నోటీసులను తన న్యాయవాది కుమరేశన్ ద్వారా పంపించినట్టు సమాచారం. ఈ నోటీసులకు గల కారణాలను కూడా అందులో వివరించారు. ఇందులో 'గత జూన్ నెల 8వ తేదీన 'అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం' అనే పేరుతో మీరు (ఎస్.ఏ.చంద్రశేఖర్) ఓ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించారు. దీనిని ఖండిస్తూ విజయ్ అపుడే ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. మీరు తీసుకునే చర్యలకు విజయ్ మద్దతు ప్రకటించలేదు. మీరు స్థాపించిన పార్టీలో విజయ్ పేరు లేదా ఫొటో వాడకూడదు. ఉల్లంఘించినట్టయితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం' అని విజయ్ తరపు న్యాయవాది పంపించిన నోటీసులో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm