హైదరాబాద్ : భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి తమన్నా, మలయాళ నటుడు అజువర్గీస్ కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్నందుకు వారు ఈ నోటీసులు అందుకున్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ వీటిని రద్దుచేయాలని కోరుతూ త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్ కేరళ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లపై మద్రాస్ హైకోర్టు గతేడాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm