హైదరాబాద్ : ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సభ్యులు భేటీ అయ్యారు. మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావును ఆయన చాంబర్లో కలిసి ఈపీఆర్సీలో గ్రామ రెవెన్యూ అధికారులకు, అందరు సీనియర్ అసిస్టెంట్ స్కేలును అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ద్వారా ఉద్యోగుల జీతభత్యాలు పెంచాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలోని వీఆర్ఓలందరూ జీతాలు సరిపోక వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు పిల్లలు స్కూల్ ఫీజులో రాయితీ కలిగించాలి కాలేజీలలో కూడా రాయితీలు కలిగించాలి. దాదాపుగా 7-8 సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నాం... ప్రమోషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది.
వీఆర్వోలందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తూ వారికి స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా జూనియర్ అసిస్టెంట్ గా నామకరణం చేసి సీనియార్టీ, అర్హత కలిగిన వీఆర్వోలు అందరికీ సీనియర్ అసిస్టెంట్లు గా ప్రమోషన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 06:26PM