“विनम्र तरीक़े से आप दुनिया हिला सकते हैं।”
— Rahul Gandhi (@RahulGandhi) January 27, 2021
-महात्मा गांधी
एक बार फिर मोदी सरकार से अपील है कि तुरंत कृषि-विरोधी क़ानून वापस लिए जाएँ।
హైదరాబాద్ : సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మోడీ సర్కారుకు మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు. 'సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర సర్కారుకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ హిందీలో ట్వీట్ చేశారు రాహుల్. దీనికి 'విదేయతతో ఉంటూనే.. ప్రపంచాన్ని కదిలించొచ్చు ' అని మహాత్మా గాంధీ వ్యాఖ్యలను జోడించారు. జనవరి 26న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రైతులు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగిన తరుణంలో.. 'హింసాత్మక ఘటనలతో సమస్యలు పరిష్కారం కావన్న రాహుల్.. జాతీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని చట్టాలను రద్దు చేయాలని మంగళవారం కోరారు.