హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో దేశంలో టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 23 లక్షలు దాటింది. బుధవారం దేశవ్యాప్తంగా 2,99,299 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు టీకా పొందిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 23,28,77కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ కారణంగా 16 మంది ఆసుపత్రుల్లో చేరగా 9 మంది మరణించినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ తెలిపారు. అయితే ఈ మరణాలకు కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm