హైదరాబాద్ : ఖమ్మంజిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ జానీ (35) మృతి చెందాడు. పొన్నెకల్లుకే చెందిన జానీ పొన్నెకల్లు నుంచి ఖమ్మం వెళ్తుండగా..భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm