హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పట్టణాలకు సమీపంలో అర్బన్ పార్కుల పేరుతో ఆక్సిజన్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేటలో వందల ఎకరాల విస్తీర్ణంలో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆక్సిజన్ పార్కు ఏర్పాటుపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేటకు అతి సమీపంలో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. 2017 వరకు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతాన్ని మూడేళ్లలో హరిత వనంగా మార్చారు. మొదట పార్కు చుట్టూ కంచె వేయించారు. అనంతరం లక్షకు పైగా మొక్కలు నాటించారు. కుంటలు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి జలవనరులను అభివృద్ధి చేశారు. ఫలితంగా పచ్చదనం, జంతుజాలం పెరిగింది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, నక్కలు, అడవి పందులు వంటి జంతువులు, నెమళ్లు వంటి పక్షుల సంతతి పెరిగింది.
ప్రజల ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పంచేలా అనేక ప్రత్యేకతలతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. చిన్నారుల కోసం ఉయ్యాల, జారుడు బండ వంటి వాటితో ఆటస్థలం, పెద్దల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రకృతి గురించి పాఠాలు నేర్చుకునేందుకు ప్రకృతి పాఠశాల, చిక్కని చిట్టడవిని తలపించే మియావాకీ ప్రకృతి వనం రూపొందించారు. మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పార్కుకు తేజో వనం అర్బన్ ఫారెస్ట్ పార్కుగా నామకరణం చేశారు. నేడు మంత్రి హరీశ్‌రావు ఈ పార్కును ప్రారంభిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2021 07:42AM