హైదరాబాద్ : విశాఖపట్నంలోని అగనంపూడి పారిశ్రామిక పార్క్ లోని వంట నూనెల కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం యూనిట్ దహనమవుతోంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm