హైదరాబాద్ : ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేస్తూ పురాతత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. మూసివేతకు గల సరైన కారణాలను వెల్లడించలేదు. బర్డ్ ఫ్లూతో అప్రమత్తత చర్యల్లో భాగంగా ఈ నెల 19 నుంచి 22 వరకు కూడా ఎర్రకోటకు సందర్శకులను అనుమతించలేదు. గణతంత్ర వేడుకల కోసం కూడా ఈ నెల 22-26 మధ్య మూసివేశారు. తిరిగి బుధవారం తెరవాల్సి ఉండగా.. తాజా ఆదేశాలిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm