హైదరాబాద్ : జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) సీనియర్ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ మంత్రి ఎంసీ మనగూళి(84) కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోశ సంబంధిత సమస్యతో.. బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. విజయపుర జిల్లాలోని సిందగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయన పూర్తిపేరు మల్లప్ప చెన్నవీరప్ప మనగూళి. 1936 సెప్టెంబర్ 29న బసవానా బాగేవడి తాలుకా ప్రాంతంలో జన్మించారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm