హైదరాబాద్ : వచ్చే నెల 1వ తేదీ నుండి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో 55 వేల మాస్క్ లు, శానిటైజర్ లను జిల్లా విద్యాధికారి రోహిణి, ఇంటర్ బోర్డ్ జిల్లా విద్యాధికారి జయప్రదలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలు ఓపెన్ చేయాలని కోరారు. స్కూల్స్ లో కరెంటు సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. 55 వేల మంది విద్యార్థులకు రెండు మాస్కులు, సానిటైజర్లు అందజేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందరికి అండగా ఉంటుంది. ఎవరు అధైర్య పడొద్దు అని తలసాని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm