హైదరాబాద్ : టీం ఇండియా క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ చిన్న తప్పు చేసి చిక్కుల్లో పడ్డాడు. దీంతో అతనిపై వారణాసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలైంది. ఇటీవల గంగా నదిలో పడవపై వెళ్తూ.. పక్షులకు.. ధావన్ ఆహరం తినిపించాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ఇదే అతన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఇది బర్డ్ ఫ్లూ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందంటూ అడ్వొకేట్ సిద్ధార్థ్ శ్రీవాస్తవ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూపీలోని బర్డ్ ఫ్లూ మార్గదర్శకాలను ఉల్లంఘించాడన్న అభియోగాలను అతనిపై మోపారు. దీనిపై కోర్టు ఫిబ్రవరి 6న విచారణ జరపనుంది. అయితే కేవలం ఆ పడవ నడిపిన వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని, ధావన్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని ఈ మధ్యే వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్ రాజ్ శర్మ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2021 12:38PM