హైదరాబాద్ : రానున్న రెండు రోజుల్లో తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన దక్షిణ మండల కేంద్రం అధ్యక్షుడు బాలచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసిన్పటికీ, తమిళనాడు, పుదుచ్చేరిలో పొడి వాతావరణం, కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని, అలాగే, 29, 30 తేదీల్లో దక్షిణ జిల్లా సముద్రతీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత్తంగా వుంటూ గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ నమోదవుతాయని ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2021 12:52PM