హైదరాబాద్ : ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము గెలిస్తే స్వచ్ఛత-పరిశుభ్రతతో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లకు అడ్డుకుంటామని తెలిపారు. ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తామని వివరించారు. గ్రామాల్లో ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదు. 2,274 ఏకగ్రీవాలు చేశారు. ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు చేయాలని అడుగుతారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా ఉందా? టీడీపీ పాలనలో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపాం అని చంద్రబాబు అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2021 01:19PM