హైదరాబాద్ : చేపల లోడ్ తో వెళ్తున్న ఓ లారీ రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో లారీలోని చేపలన్నీ చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపై కొట్టుకుంటున్న చేపలను చూడగానే స్థానికులంతా అక్కడకు చేరుకున్నారు. రోడ్డుపై పడిన చేపలను తీసుకున్నారు. దీంతో సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం పోలీసులు అక్కడకి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
Mon Jan 19, 2015 06:51 pm