హైదరాబాద్ : గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఐదు కిలోల బరువున్న మగశిశువుకు జన్మనిచ్చింది. తెనాలి మండలం నంది వెలుగుకు చెందిన రేష్మ తొలి కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది. సాధారణ విధానంలో కాన్పు కష్టమని తేల్చిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి బాబును బయటకు తీశారు. సహజంగా పుట్టిన పిల్లలు 2 నుంచి 4 కేజీల వరకు బరువు ఉంటారని.. ఈ బాలుడు మాత్రం ఐదు కిలోలు ఉండటం అరుదైన విషయమని వైద్యులు అంటున్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వారు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm