హైదరాబాద్ : 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన పోలీసు అవార్డుల్లో ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోడలు సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిప్రా శ్రీవాస్తవ్‌కు ఉత్తమ పోలీసు సేవా పతకం లభించింది. శ్రీవాస్తవ్ ప్రస్తుతం వెస్ట్ ముంబై హెడ్ క్వార్టర్స్‌లో అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్(సీఐఎస్ఎఫ్)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె 2004 బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్ అధికారిణి. ఈమె గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంరక్షణ అధికారిణిగాను, హైదరాబాద్‌లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ రక్షణ అధికారిణిగాను పనిచేశారు. శిప్రా శ్రీవాస్తవ్ భర్త లావుడ్యా జీవన్ లాల్ అడిషనల్ కమిషనర్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
అవార్డు రావడంపై ఆమె స్పందిస్తూ.. నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తనకు దక్కిన ఈ గుర్తింపు వెనుక తన కుటుంబ సహకారం ఎంతో ఉందని చెప్పారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ఐపీఎస్ శిప్రా శ్రీవాస్తవ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2021 03:57PM