హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. మొదట కరోనా వ్యాక్సిన్ వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. నేటి నుంచి ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్, బీ పాజిటివ్ మ్యాగ్‌జైన్ ఎడిటర్, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకాపై భయాలను తొలగించేందుకు గాను ఆమె అపోలో సిబ్బందితో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm