పుదుచ్చేరి: కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు సీఎం నారాయణస్వామి బయల్దేరారు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరో ఎమ్మెల్యే ఉద్వాసనకు గురవడంతో ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలాన్ని నిరూపించుకోవాలసి వచ్చింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వానికి ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ బలం 11కు పడిపోయింది. తాజాగా రాజీనామా చేసిన వారిలో ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా, మరొకరు భాగస్వామ్య పార్టీ డీఎంకే ఎమ్మెల్యే.
Mon Jan 19, 2015 06:51 pm