హైదరాబాద్: తెలంగాణలోని ఓ ప్రయివేటు పాఠశాల యాజమాన్యానికి రాష్ట్ర వినియోగదారుల సేవా కేంద్రం రూ.11.50లక్షల భారీ జరిమానా విధించింది. వివరాలలోకి వెళ్తే.. మహబూబాబాద్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కృపాకర్‌ను గతేడాది మార్చి 3న హాస్టల్ వార్డెన్ దండించాడు. కర్రతో కొట్టగా ఆ విద్యార్థి కుడి కన్నుకు తీవ్ర గాయమై చూపుకోల్పోయాడు. దీంతో విద్యార్థి తండ్రి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఆశ్రయించారు. సేవా కేంద్రం అధికారులు పాఠశాల యాజమాన్యాన్ని, బాధిత విద్యార్థిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థి చూపు కోల్పోడంతో పాఠశాల యాజమాన్యం నుండి నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన రూ.11.50లక్షల చెక్కును విద్యార్థి కృపాకర్‌కు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 22 Feb,2021 08:25PM