హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్ ప్రాంతంలో కస్టమర్ల విషయంలో ఇద్దరు చాట్ షాపు యజమానుల మధ్య మొదలైన వాగ్వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. కోపంతో రెచ్చిపోయిన వారు ఇనుపరాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వీరికి మద్దతుగా మరి కొంత మంది రంగంలోకి దిగడంతో పెద్ద గలాటా చెలరేగింది. ఇరు వర్గాలు చేతికి దొరికినవస్తువులతో తీవ్రంగా దాడి చేసుకున్నారు. అయితే.. ఈ క్రమంలో అక్కడి వారెవరికీ తీవ్రగాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. దాడుల విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. కస్టమర్లను తమ స్టాళ్లకు ఆకర్షించే క్రమంలోనే ఇద్దరు షాపు యజమానుల మధ్య వివాదం తలెత్తిందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm