హైదరాబాద్: తెలుగులో ప్రసారం అయ్యే షోలన్నింటిలోనూ ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది జబర్ధస్త్. కామెడీ ప్రధానంగా మొదలైన ఈ కార్యక్రమం దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తోంది. రేటింగ్‌లోనూ దూసుకుపోతూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇంతటి ప్రభావితమైన షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో ఆటో రాంప్రసాద్ ఒకడు. చాలా కాలంగా తనదైన పంచులతో సత్తా చాటుతోన్న అతడు.. అమ్మాయిలకు బ్లాక్ మెయిల్ కాల్స్ అంటూ షాకింగ్ విషయాలు లీక్ చేశాడు. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్క్రిప్ట్ రైటర్‌గా, కమెడియన్‌గా ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఆటో రాంప్రసాద్ ఓ షాకింగ్ న్యూస్ బయట పెడుతూ వీడియోను విడుదల చేశాడు. తన పేరుతో కొందరు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అందులో వెల్లడించాడు. అంతేకాదు, అందులోనే దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ‘నేను అడిగానని కొందరు అమ్మాయిల ఫొటోలు తీసుకున్నారు. కానీ, అవి అడిగింది నేను కాదు. నా పేరిట సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ఆ పని చేశారు. అలాంటి వాళ్లను నమ్మకండి. నాకు ఫేస్‌బుక్‌లో మాత్రమే అధికారిక ఖాతా ఉంది. నేను ఏ అప్‌డేట్ ఇవ్వాలన్నా దాని నుంచే ఇస్తాను' అని పేర్కొన్నాడతను.
Mon Jan 19, 2015 06:51 pm