అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని పరిధిలో అంసపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. కాకినాడ ఎస్‌ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎస్‌ఈజెడ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm