హైదరాబాద్: ఎంతటి సాంకేతిక పరిజ్ఞానమైనా సమాజానికి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలనేదే సీఎం కేసీఆర్ అభిమతం అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రెండో రోజు బయో ఆసియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో వర్చువల్‌గా జరిగిన చర్చావేదికలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయో ఆసియా సదస్సు నిర్వహణను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
చర్చా వేదికలో భాగంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లకు మంచి అవకాశాలున్నాయని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా వైద్యరంగంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. వైద్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ఇన్‌పేషెంట్ విభాగంలో కృత్రిమ మేధస్సుది కీలకపాత్రగా ఉందన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Feb,2021 04:30PM