హైదరాబాద్: రేపటి నుండి 6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి స్వాగతించారు.
పాఠశాలల్లో దశలవారీగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నవంబర్ నుండి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ పదేపదే ప్రాతిపాదనలు చేసిన ఫలితంగా ఆలస్యంగానైనా ఫిబ్రవరి1 నుండి 9,10 తరగతులకు ప్రారంభించిన ప్రత్యక్ష బోధన గత మూడు వారాలుగా సజావుగా సాగుతోంది. అదే అనుభవంతో ప్రాథమికోన్నత(6,7,8) తరగతులను కూడా ఈనెల 15 నుండే ప్రారంభించాలని, ఈనెల చివరి వారంలో ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించి విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని లోగడనే టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం అందుకు అంగీకరించి అనుమతించటం హర్షణీయం. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను కూడా మార్చి మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టిఎస్ యుటిఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే కోవిడ్ నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక పారిశుద్ధ్యం నిర్వహణ కోసం పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలి. ప్రతి సెక్షన్ కు 20మంది విద్యార్థులు మించకుండా తరగతులు నిర్వహించాలని నిబంధనల్లో పేర్కొన్నందున అదనంగా అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలల్సి ఉన్నందున, ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఖాళీలను ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని, ఇంకా అదనంగా అవసరమైతే విద్యావాలంటీర్లను నియమించాలని టిఎస్ యుటిఎఫ్ కోరుతున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Feb,2021 05:07PM