హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పరిశీలకునిగా మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్ హర్ ప్రీత్ సింగ్కు బాధ్యతలు అప్పగించింది. నల్గొండ - వరంగల్ - ఖమ్మం నియోజకవర్గానికి యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి సవ్యసాచి ఘోష్ ను ఎన్నికల పరిశీలకునిగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆ ఇద్దరు అధికారులకు లేఖలు పంపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Feb,2021 07:16PM