Yet Another Shocker!!!
— VARNIT GUPTA (@varnit_news) February 22, 2021
A 25yrs old college going student was found half Naked with burnt injuries in #shahjahanpur of UP. #MissionShakti @shahjahanpurpol @Uppolice @HomeDepttUP @dgpup @AwasthiAwanishK @UPGovt @CMOfficeUP @bhupendrachaube @IndiaAheadNews @indiaaheadhindi pic.twitter.com/lfKtvaneiv
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. షాజహాన్‌పూర్‌లో తీవ్రంగా కాలిన గాయాలతో జాతీయ రహదారిపై నగ్నంగా పడి ఉన్న ఓ విద్యార్థినిని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన కళాశాలలో ఆమె బీఏ సెకండియర్ చదువుతున్నట్టు గుర్తించారు. ఆమె శరీరం 60 శాతం కాలిపోయిందని, చికిత్స కోసం లక్నోలోని దవాఖానకు తరలించినట్టు ఎస్పీ ఆనంద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజన్ పూరర్ పరిధిలో స్వామి సుఖ్ దేవానంద్ కాలేజీలో 21 ఏళ్ల యువతి బీఏ సెకండియర్ చదువుతోంది. నగరంలోని కాంత్ ప్రాంత పరిధిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. సోమవారం ఉదయం తన స్నేహితులు ఫోన్ చేశారనీ, కాలేజీలో దింపమని తండ్రిని కోరింది. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కూతురిని ఆ తండ్రి కాలేజీ గేటు వద్ద దింపాడు.
కొద్ది సేపట్లో తిరిగి వస్తానని వెళ్లేటప్పడు చెప్పింది. కానీ ఆమె ఎంతకూ తిరిగి రాలేదు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో కాలేజీ లోపలికి వెళ్లి ఆమె కోసం ఆ తండ్రి వెతికాడు. కానీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాలేజీ బయట, చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ, బంధువుల వద్ద కూడా తన కూతురి గురించి ఆ తండ్రి ఆరా తీశాడు. రాత్రి ఏడు గంటల సమయంలో ఆ తండ్రికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ’మీ కూతురిపై హత్యాయత్నం జరిగింది. ఆమెను ఎవరో మంటల్లో కాల్చేశారు. నగారియా ప్రాంతంలో రోడ్డు పక్కన సగానికి పైగా కాలిపోయిన స్థితిలో అపస్మాకర స్థితిలో పడి ఉంది. మేము ఆసుపత్రికి తీసుకు వచ్చాం.‘ అంటూ ఆ తండ్రికి ఓ బాంబులాంటి వార్తను పోలీసులు చెప్పారు. దీంతో హుటాహుటిన ఆ తండ్రి ఆసుపత్రికి వెళ్లాడు.
బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె సహవిద్యార్థినిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘ఉదయం 11 గంటల సమయంలో నా కుమార్తెను కాలేజీ దగ్గర వదిలిపెట్టా. 3 గంటలకు కాలేజీ అయిపోయాక విద్యార్థులందరూ బయటకు వచ్చినా తను రాలేదు. సాయంత్రం ఆరు గంటలైనా తన జాడ తెలియలేదు. అనంతరం పోలీసుల నుంచి కాల్ వచ్చింది’ అని వివరించారు. తన కుమార్తె స్నేహితురాళ్లలో ఒకరు ఆమె వేరే గేట్ గుండా లోపలికి వెళ్లాలని చెప్పిందని, తను మాత్రం ఆ గేట్ గుండా వెళ్లలేదన్నారు. ఆమె వల్లే తన కుమార్తెకు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.