హైదరాబాద్: పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి.. రాష్ట్రపతి పాలనకు దారితీసేలా ఉంది. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేశారు. అయితే ఎల్జీ పంపిన లేఖను కేంద్ర కేబినెట్ నేడు ఆమోదిస్తూ.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాజపా, దాని కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఎల్జీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. గురువారం పుదుచ్చేరిలో ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm