అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతేరా)స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారరంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు. లక్షా పది వేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా మొతేరా రూపుదిద్దుకుంది. ఈ మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేశారు. భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు ఇక్కడ బుధవారమే ఆరంభం కానుంది. అసలే భారీ స్టేడియం.. పైగా డేనైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్ జరగబోతుండటం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm