హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్న వైయస్ షర్మిల వరుస సమావేశాలతో దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే దివంగత వైయస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించారు. ఇదే సమయంలో మరోవైపు పలువురు నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆమెను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పార్టీని నిర్మించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. మరోవైపు యువతపై షర్మిల దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో ఈరోజు షర్మిల సమావేశమయ్యారు. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm