హైదరాబాద్: హరియాణలో బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలో మంగళవారం రాత్రి ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి శరీరాలు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఘోగ్రిపూర్ రోడ్డు సమీపంలోని బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ శబ్ధం, మంటలతో పేలుడు జరిగింది. ప్రమాదంలో మరణించి వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ముగ్గురిని శివం కుమార్(28), విజయ్ పాల్(22), విజయ్ కుమార్(25)లగా గుర్తించారు. వారంతా వలస కార్మికులే. ఈ ప్రమాదంతో బాణసంచా కర్మాగారంలోని అధిక భాగం మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. బాణసంచా కర్మాగారం యాజమాని రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. పేలుడు సంభవించిన సమయంలో మృతి చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు బాణసంచా తయారీ విభాగాన్ని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కారు టైరు పేలి.. 7గురు మృతి ఇదీ చదవండి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Feb,2021 02:29PM