హైదరాబాద్ : డిగ్రీ విద్యార్థిని ఓ దుండగుడు గొంతు నులిమి హత్య చేసిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలోని నరసరావుపేట శివారులో చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతోన్న అనూష అనే విద్యార్థినిని దుండగుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోవిందపురం మేజర్ కాలువలో పడేశాడు.మృతురాలు ముప్పాళ్ల మండలం గోళ్లపాలెం వాసిగా గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనూష హత్యపై విద్యార్థులు, బంధువులు ధర్నాకు దిగారు. కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm