హైదరాబాద్ : కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. 60 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికీ టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది. 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంత రుసుముతో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఈ విషయం వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత రుసుము వసూలు చేస్తారో త్వరలో నిర్ణయించి చెబుతామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm