హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ త్వరలో మాజీ ప్రధాని అవుతారని బాఘేల్ జోస్యం చెప్పారు. గుజరాత్‌లోని మెతెరా స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో మార్పు చేయడంపై ఆయన స్పందించారు. ఇది బీజేపీ సాంప్రదాయమని విమర్శించారు. గతంలో అటల్ జీ జీవించి ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో అటల్ చౌక్ పేరు పెట్టారని తెలిపారు. అనంతరం ఆయన మాజీ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. మోడీ కూడా త్వరలో అటల్ జీ లాగే మాజీ ప్రధాని అవుతారనడానికి ఇది ఒక సంకేతమని భూపేష్ బాఘేల్ వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm