హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో గురువారం భూకంపాలు సంభవించాయి. వేకువ జామున 3.55 గంటలకు చంబాలో రిక్టర్ స్కేల్‌పై 2.4 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్)కు తెలిపింది. ధర్మశాలకు 70 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చాయని చెప్పింది. అలాగే అంతకు ముందు కాంగ్రాలో ఉదయం 2.33 గంటల రిక్టర్ స్కేల్‌పై 2.2 ప్రకంపనలు వచ్చాయి. ధర్మశాలకు 11 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్‌సీఎస్ చెప్పింది. భూకంపాలతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదని అధికారులు తెలిపారు. బుధవారం బేఆఫ్ బెంగాల్, పశ్చిమ ఢిల్లీ, మణిపూర్ చందేల్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm