హైదరాబాద్: మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు గురువారం వంట గ్యాస్ ధరలను పెంచాయి. వంటగ్యాస్‌పై రూ.25 బాదాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.846.50కు ఎగసింది. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఫిబ్రవరి నెలలో మూడోసారి కావడం గమనార్హం. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా.. 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. మొత్తం మూడుసార్లు సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.100 బాదాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకిన నేపథ్యంలో సిలిండర్ ధరలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. పెరిగిన చమురు ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరోసారి పెరిగిన సిలిండర్ రేట్ల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు నెలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లను అనుగుణంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరను మారుస్తూ వస్తాయి. అయితే ఈ సారి మాత్రం మూడు సార్లు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లోనూ రెండు సార్లు పెంచాయి.
Mon Jan 19, 2015 06:51 pm