హైదరాబాద్: ఇది మనుషుల చేసే పని కాదు. రాక్షసులు చేసే పని. మహిళను చంపి, ఆమె గుండెతో కూర చేశాడు ఓ కిరాతకుడు. ఆమె గుండెతో వండిన కూరను తన అత్త కుటుంబానికి తినిపించి.. వారిని కత్తులతో నరికాడు. ఇలా మొత్తం ముగ్గురి పొట్టనబెట్టున్నాడా రాక్షసుడు. అమెరికాలోని ఓక్లాహామాలో ఈ ఘోరం జరిగింది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓక్లహామాలోని చికాషా ప్రాంతానికి చెందిన లారెన్స్ పాల్ అండర్సన్ అనే వ్యక్తి తన అత్త మామ లియో పై, డెస్లీ పైతో కలిసి నివసిస్తున్నాడు. ఐతే ఈ నెల 9న తన పక్క ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ మహిళను కత్తితో నరికి చంపాడు. ఆమెను చంపిన తర్వాత శరీరాన్ని కోసి ఆమె గుండెను బయటకు తీశాడు. దానిని వెస్ట్ మిన్నెసోటాలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లి.. ఆలుగడ్డలతో కలిపి కూర చేశాడు. ఆ కర్రీని తన అత్త మామలతో పాటు వారి నాలుగేళ్ల మనవరాలికి కూడా తినిపించాడు. అనంతరం వారిపైనా కత్తులతో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆయన మామ లియో పై, నాలుగేళ్ల పాప మరణించింది. అత్త డెస్లీ పై తీవ్రంగా గాయపడింది. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా మొత్తం ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా చంపేశాడు.
చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పాల్ అండర్సన్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. దెయ్యాల నుంచి కాపాడుకునేందుకే ఇలా చేశానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, లారెన్స్ పాల్ అండర్సన్ గతంలో నేర చరిత్ర ఉంది. ఓ మర్డర్ కేసులో 2017లో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాత.. అతడికి గవర్నర్ కెవిన్ స్టిట్ క్షమాభిక్ష ప్రసాదించాడు. దాంతో ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు అండర్సన్. అప్పటి నుంచి తన అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. కానీ అంతలోనే ముగ్గురు వ్యక్తులను హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అతడిని జైలు నుంచి బయటకు వదలొద్దని.. లేదంటే అందరినీ చంపేస్తాడని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రాక్షసుడిని ఉరితీసి చంపాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 08:57AM