అమరావతి: కృష్ణా జిల్లాలోని నూజివీడు హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. గురువారం రోడ్డు మీదుగా వెళ్తున్న గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మీర్జాపురం మల్లవల్లి సమీపంలో చోటు చేసుకుంది. లారీ ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు రోడ్డు నిండా చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గొర్రెల ఖరీదు సుమారుగా రూ.05 లక్షలుగా ఉంటుందని కాపర్లు వాపోతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కాపర్లు వేడుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm