ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అక్కడి వాషిమ్ జిల్లాలోని ఓ స్కూల్ హాస్టల్‌లో ఏకంగా 229 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో స్కూల్ పరిసరాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ విద్యార్థులలో చాలా వరకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి, యవత్మల్ జిల్లాలకు చెందిన వాళ్లే కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో ఈ రెండు జిల్లాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అటు రాష్ట్రం మొత్తంలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లోనే మహారాష్ట్రలో మొత్తం 8 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, ముంబై మహానగర పాలక సంస్థ హెచ్చరిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm