హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి చెర్వు ముందలి తండా (కుసుమ సముద్రం)లో కెతావత్ లాల్య మేకల మందపై చిరుత దాడిచేసింది. దీంతో నాలుగు మేకలు మృతి చెందాయి. విషయాన్ని గ్రామస్తులు అటవీ అధికారులు తెలియజేశారు. దీంతో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, మెదక్ జిల్లాలోని హవేలిఘనపూర్ మండలం బొగుడభూపతిపూర్‌లో కూడా చిరుతపులి సంచరించింది. రెండు మేకలపై దాడిచేసి హతమార్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వీలైనంత తొందరగా చిరుతపులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm