హైదరాబాద్: ఘట్‌కేసర్ లో ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని కేసులో విచారణ కొనసాగుతోంది. కిడ్నాప్ డ్రామాతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని (19) బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య కేసులో ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థిని ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు. వారం రోజులుగా విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఆహారం తీసుకోకుండా.. విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తెలినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్..చిన్నకూతురిని చంపింది.!
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 11:42AM