చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేల ఆ రాష్ర్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులను, ప్రజలను మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం పళనిస్వామి.. అసెంబ్లీ వేదికగా ఆ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 59 నుంచి 60 ఏండ్లకు పెంచుతున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇక స్కూల్ విద్యార్థులకు కూడా శుభవార్త వినిపించారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ దృష్ట్యా 9, 10, 11 తరగతుల విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం పళనిస్వామి ప్రకటనల నేపథ్యంలో అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm