ముంబై: దేశీయంగా రికార్డుస్థాయికి చేరుతున్న ఇంధన ధరలపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండుతున్న పెట్రోధరలపై కేంద్రం సానుకూల పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అధిక ధరలు కార్లు, బైక్‌లను ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు తయారీ, రవాణా రంగాలను తీవ‍్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ‍్యక్తం చేశారు. ఇది వ్యాపార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. వరుస బాదుడు తరువాత ప్రస్తుతం స్థిరంగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు కొన సాగుతున్నాయి. ఈ నెల 23న పెట్రోల్ , డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm