నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలోని 11వ డివిజన్ వెంగళ్ రావ్ నగర్ కాలనిలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కృషి చేసి పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే ముఖ్యమైన వ్యక్తి కార్యకర్త అని తెలుపుతూ ఈ దేశంలో పార్టీ కోసం కష్ట పడే కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మన రాష్టం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, నగరంలో కూడా ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని అందులో భాగంగానే నిజామాబాద్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్త నాయకత్వన్ని బలపరచటానికి ముందుకు వస్తున్న ప్రతి కార్యకర్తకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు షాకిర్, ముక్తర్, సుధాకర్, మెయిన్, సలీం, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 04:41PM