హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత వ్యాపారులపై, ప్రజలపై అధిక భారాలు వేస్తూ దోచుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేబిల్‌తో పాటు, చమురు ధరలపై భారీగా వేస్తున్న పన్నులు, జీఎస్‌టీ ద్వారా వేస్తున్న అత్యధిక పన్నులు తధితర సమస్యలపై ఈ నెల 26న అఖిల భారత వ్యాపార సంస్థలు (సీఏఐటీ) ఇచ్చిన భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నది. ఈ పన్నుల ద్వారా ప్రజలందరిపై భారాలు పడుతున్నందున ప్రజలు ఈ బంద్‌కు తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నది.
నరేంద్రమోడీ ప్రభుత్వం చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. రిలయన్స్, ఎస్‌ఆర్ లాంటి కంపెనీల లాభాల కోసం పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భరించలేని భారాలు వేస్తున్నది. పెట్రోల్, డీజిల్‌పై విధించే పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోతే మళ్ళీ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని, ఈ ప్రభావం తయారీరంగం, ఉత్పత్తిరంగంపైనా ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ సూచించినా, బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఒక్క నెలలోనే ఆయిల్ ధరలు ఏడుసార్లు పెంచి లీటర్ పెట్రోల్‌పై 60 శాతం, డీజిల్‌పై 56 శాతం పన్నులు వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుతింటున్నాయి. వీటి పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో వంటగ్యాస్ ధరలు మూడుసార్లు పెరిగి రు.822లకు చేరింది. గ్యాస్‌పై వినియోగదారునికిచ్చే సబ్సిడీకి కోత విధించి రు.40లకు పరిమితం చేసింది. కేంద్ర ప్రభుత్వం సులభతర పన్ను విధానం పేరుతో జిఎస్‌టిని తెచ్చి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా స్లాబుల రేట్లు పెంచి అత్యధిక పన్నులు వసూలు చేస్తూ ప్రజలను, పరిశ్రమలను, వ్యాపారులను దోచుకుంటున్నది. దీంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి కోట్లాది ప్రజలు నిరుద్యోగులయ్యారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని గత 91 రోజులుగా రైతాంగం ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరహాలోనే 8 కోట్ల మంది చిరువ్యాపారుల మనుగడకోసం, వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 40 వేల అసోసియేషన్లు, అఖిలభారత వాహనదారుల సంక్షేమ సంఘాలు ఈ నెల 26న ఇచ్చిన భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 06:10PM