హైదరాబాద్ : కారు, ప్రైవేటు బస్సు ఢీకొని తండ్రీకుమారుడు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై తండ్రీ కుమారుడు కారులో ఆసుపత్రికి వెళ్తుండగా.. గుడపల్లి వద్దకు రాగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వి.కోట మండలం పట్రపల్లికి చెందిన సుబ్బప్ప, కాంతప్పగా గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm