కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోదాడ పెద్ద చెరువులో దూకి యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న ప్రేమ జంట అదృశ్యంపై పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కోదాడ పెద్ద చెరువులో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm