- 163 జాతీయ రహదారి పైనే అధికంగా ప్రమాదాలు
- అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణాం
- చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు
నవ తెలంగాణ కొడంగల్
హైదరాబాద్ - బీజాపూర్ 163 జాతీయ రహదారిపై కొడంగల్ నుండి రావులపల్లి వరకు రోడ్డు ప్రమాదాలు తరుచూ చోటు చేసుకోవడంతో ప్రాణ నష్టం వాటిలడమే కాకుండా ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్న ఘటనలు ఉన్నాయి, జాతీయ రహదారులపై నిఘా లేకపోవడం, డ్రైవర్లు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలను మితిమీరిన వేగంతో నడపడంతో పలువురు మరణానికి కారకులు అవుతున్నట్టు తెలుస్తోంది, హైదరాబాద్- బీజాపూర్, బీజాపూర్- హైదరాబాద్ నిత్యం వేల మంది వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తుంటారు, వికారాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం, గతంలో కంటే ఈ మార్గంలో రాకపోకలు గణనీయంగా పెరిగాయి, హైదరాబాద్ నుంచి కర్ణాటక ఎక్కువమంది ప్రయాణిస్తుంటారు, దౌల్తాబాద్, కోడంగల్ మండల ప్రజలు హైదరాబాద్, వికారాబాద్ వచ్చిపోతుండగా ఎక్కువమంది ఇటువైపు ప్రయాణిస్తుంటారు, ఈ మార్గంలో ప్రయాణం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది, గతంలో కన్నా రోడ్డు మెరుగుగా ఉండడంతో వాహనదారులు అతివేగంగా వెళ్లడంతో ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది, తరచూ చిట్లపల్లి గేటు దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరిగిన బ్లాక్ స్పాట్ గా గుర్తించి చర్యలు తీసుకోవడం లేదు, వాహనదారులు ఎలాంటి జాగ్రత్త సూచికలు పాటించకుండా అజాగ్రత్తగా అతి వేగంగా నడపడంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు, కోడంగల్, బొంరాస్ పేట్ మండలాలలో మీదుగా వెళ్ళే జాతీయ
రహదారిలోనే ఒక సంవత్సర కాలంలో 2019 జనవరి నుండి 2019 డిసెంబర్ వరకు 74 యాక్సిడెంట్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది, దీంట్లో అధికంగా ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారు, ఈ రహదారి పై నిత్యం వేలాది వాహనాలు ఓవర్ స్పీడ్ తో వెళుతుంటాయి, కానీ ఈ హైవేపై పోలీస్ శాఖ, జాతీయ రహదారి నిర్వహణ సంస్థ పెట్రోలింగ్ అంతంతమాత్రంగానే ఉండడంతో రహదారి ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి, జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వారిపై నిఘా పెట్టవలసిన బాధ్యత హైవే పెట్రోలింగ్ పార్టీలతోపాటు రహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినప్పటికీ వారు పెట్రోలింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్లు మద్యం, నిద్ర మత్తులో వాహనాలు నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరం అని తెలిసిన పలువురు చెవికి ఎక్కించుకోవడం లేదు, దీంతో వారే కాక ఇతరులను ప్రమాదంలోకి నెడుతున్నారు, ఈ తరహా రోడ్డు ప్రమాదాలే అధికమవుతుండడంపై ప్రజలు ఈ పరిణామంపై ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న యాక్సిడెంట్లు మాత్రం తగ్గడం లేదు, ప్రాణ నష్టం జరిగినప్పుడే సూచనలు ఇచ్చి పక్కకు తప్పుకుంటున్నారన్ని అంటున్నారు ప్రమాదాలకు నిలయంగా ఉండే ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్ లకు కొంత అడ్డుకట్ట పడుతుందని స్థానికులు చెబుతున్నారు, మద్యం సేవించి, వేగంగా వెళ్లిన వాహనాలు ఎక్కువ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, అంతే కాకుండా మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునేందుకు హైవేపై బ్రీత్ ఎనలైజర్ లను సైతం అందుబాటులో ఉంచారు, వాహనాల స్పీడ్ తగ్గించేందుకు స్పీడ్ గన్నులాంటి నిఘా కెమెరాలను ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోతుంది, వాహనాల అతివేగానికి పోలీస్ శాఖ కళ్లెం వేయలేక పోతుందనే వాదన ప్రజలనుంచి వినబడుతోంది, రహదారులపై రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖలు నిఘా పెట్టకపోవడంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ప్రమాదాలకు కారణాలను అధికారులు పసిగట్ట లేకపోతున్నారు, అనుభవం లేని డ్రైవర్లు, రాత్రి భారీ వాహనాలను జాతీయ రహదారిపై నడపడంతో, డ్రైవర్లు మద్యం,నిద్ర మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ఇవే కాకుండా ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని పోవడంతో, అవి అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సమయాలలో ప్రాణ నష్టం సంభవిస్తుంది, ఇలాంటి ఘటనలు జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక దగ్గర జరుగుతున్న వాహనదారులకు అవగాహన కల్పించలేకపోతున్నారు, జాతీయ రహదారిపై సూచిక బోర్డులు ఉన్న వాహనదారులు అతివేగంగా ఆ జాగ్రత్తగా నడిపించడంతో పాటు ప్రమాద సూచికలను గమనించకపోవడం, రాత్రి సమయాలలో లారీ డ్రైవర్లు మితిమీరిన వేగం తో పాటు, మద్యం సేవించి నిద్ర వస్తున్న డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొనడంతో అమాయకులు వారి ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది, ఈ నెల రోజుల కాలంలోనే లారీ డ్రైవర్ చక్కెర లోడుతో రావులపల్లి నుండి కొడంగల్ వైపు వస్తూ మద్యం సేవించి అర్థంకాని పరిస్థితులలో లారీ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు అంతా లారీని తిప్పుతూ ఎదురుగా వాహనాలు రాకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పి లారీని రోడ్డు కిందికి తీసుకు వెళ్ళడంతో బోల్తాపడింది, చిట్లా పల్లి గేటు దగ్గర ఉదయం 3 గంటల సమయంలో లారీ డీసీఎం ఢీ కొని నిద్రమబ్బులో ఉన్న లారీ డ్రైవర్ డీసీఎంను ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు, చిట్ల పల్లి గేటు సమీపంలో బైక్ పై వెళ్తున్న వాహనదారుని లారీ ఢీ కొని తల పై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు, తరచూ ఇలాంటి ప్రమాదాలపై ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం: సీఐ అప్పయ్య
163 జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం, ఆటోలు పరిమితికి మించకుండా ప్రయాణికులను సురక్షితంగా ప్రయాణికులను చేర్చేందుకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం, వేగంతో వెళ్తున్న వాహనదారుల వేగ నివారణకు స్పీడ్ గన్నులతో చాలన్ వేస్తున్నాం, ద్విచక్ర వాహనదారులకు హెల్మెంట్ ధరించాలని, తాగి వాహనాలు నడపరాదని రవాణా చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం, కాలేజీ, స్కూలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు చెప్పే విధంగా చూస్తాం, వాహనాల వేగం తగ్గించడానికి బుల్ హార్స్, స్టిప్స్ ఏర్పాటు చేస్తాం, సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు చెకింగ్ చేస్తున్నాం, పోలీసుల చెకింగ్ పెంచి ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Feb,2021 12:41PM